Varahi Yatra: నేటినుంచి నాలుగోవిడత వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.

  • Written By:
  • Publish Date - October 1, 2023 / 11:40 AM IST

 Varahi Yatra:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.

మచిలీపట్నంలో జనవాణి..( Varahi Yatra)

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పవన్ సభ నిర్వహించనున్నారు. అక్టోబర్ 2న మచిలీపట్నంలో కృష్ణా జిల్లా జనసేన నేతలతో పవన్ భేటీ కానున్నారు. అక్టోబర్ 3న మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న పెడన, 5న కైకలూరులో పవన్ కళ్యాన్ పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం ఐదు రోజులపాటు పవన్ వారాహి విజయ యాత్ర కొనసాగనుంది. కృష్ణా జిల్లా వారాహి యాత్రకు కో ఆర్డినేటర్స్ నియామకం జరిగింది.
అవనిగడ్డ కుపోతిన వెంకట మహేష్, తాతంశెట్టి నాగేంద్ర, మండలి రాజేష్, పెడన కు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమ్మిశెట్టి వాసు, చిల్లపల్లి శ్రీనివాస్ కైకలూరు కు ముత్తా శశిధర్, చనమల్ల చంద్రశేఖర్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశం అనంతరం బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొంటాయి టీడీపీ, జనసేనలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

వారాహియాత్ర విజయవంతం కావాలి..

నాలుగో విడత వారాహియాత్ర విజయవంతం కావాలని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. వారాహియాత్ర విజయవంతం అయ్యేందుకు తెలుగుదేశం శ్రేణులు కూడా జనసేనతో కలిసి నడవాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.