Uppal Stadium: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ హెచ్ సి ఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది .ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి .. ఆధ్వర్యంలో ధర్నాచేసారు.
ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ శివసేనారెడ్డి ఆరోపించారు .కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని ,కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోందని ఆరోపించారు .టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రెసిడెంట్ పై ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాం అని ఈ సందర్భంగా శివసేనారెడ్డి పేర్కొన్నారు.
టికెట్ల దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని , హెచ్ సి ఎ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాడని యూత్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు . జగన్మోహన్ రావు హరీష్ రావు కు బినామీ గా ఉండి బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్నాడని ఆరోపించారు .ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ గా తప్పుకోవాలని డిమాండ్ చేసారు . క్లబ్ మెంబర్స్ కు సైతం టికెట్లను ఎగ్గొడుతున్నాడని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు .ఈ సందర్భంగా పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఉప్పల్ పీస్ కు తరలించారు .గురువారం ఉప్పల్ స్టేడియం లో డే అండ్ నైట్ మ్యాచ్ జరగ బోతుంది.