Site icon Prime9

Minister KTR: పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం.. మంత్రి కేటీఆర్

Minister KTR

Minister KTR

Minister KTR: రాజ‌కీయ నిరుద్యోగులు యువ‌త‌ను రెచ్చ‌గొడుతున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పొలిటిక‌ల్ టూరిస్టుల‌కు తెలంగాణ స్వాగ‌తం పలుకుతుందని అన్నారు. ప్రియాంక గాంధీ త‌న పొలిటిక‌ల్ టూర్‌ను ఎడ్యుకేష‌న్ టూర్‌గా మార్చుకున్నారని, హైదరాబాద్ అభివృద్ధి చూసి ప్రియాంక పాఠాలు నేర్చుకోవాలన్నారు.

గాంధీ భ‌వ‌న్‌ను గాడ్సేకు అప్ప‌గించి..(Minister KTR)

తెలంగాణ ఉద్య‌మ‌కారుల బ‌లిదానాల‌కు కార‌ణ‌మైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ త‌ర‌పున క్ష‌మాప‌ణ చేప్పాలన్నారు. సోనియా గాంధీ బ‌లిదేవ‌త అన్న వ్య‌క్తికే పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చారని విమర్శించారు. గాంధీ భ‌వ‌న్‌ను గాడ్సేకు అప్ప‌గించి త‌న అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని. కాంగ్రెస్ అమాయ‌క‌త్వ‌మో, ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మో తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు.

ప్రియాంక గాంధీ కాళ్లకు నమస్కరిస్తే ..

ఇలా ఉండగా మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిని స్టడీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణలోని వైన్ షాపులను స్టడీ చేయాలా… లేదంటే ఆడపిల్లలపై జరుగుతున్న అమానుష ఘటనల్ని స్టడీ చేయాలా… అని ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునే వారని విమర్శించారు. ప్రియాంక గాంధీ కాళ్లకు నమస్కరిస్తే మీ పాపాలు తొలగుతాయన్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ఆమె.. హైదరాబాద్ మహానగరంలో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్ పర్యటనకు ఆమె గంటసేపు మాత్రమే సమయం కేటాయించి తిరిగి వెడతారని తెలుస్తోంది.

Exit mobile version