Site icon Prime9

MLC By-Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

MLC By-Election

MLC By-Election

 MLC By-Election: తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో.. రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. జనవరి 22 వ తేదిన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు.

రెండూ కాంగ్రెస్ కే దక్కే అవకాశం..(MLC By-Election)

వాస్తవానికి అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ,బీఆర్ఎస్ లకు చెరో స్దానం దక్కాలి. అయితే ఈ రెండు స్దానాలకు నోటిఫికేషన్లు, పోలింగ్ కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనితో కాంగ్రెస్ పార్టీకి రెండు స్దానాలు దక్కనున్నాయి. ఈ రెండు స్దానాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడం, ఇంకను మంత్రివర్గంలో బెర్త్ లు ఖాళీగా ఉండటం దీనికి కారణాలుగా చెప్పవచ్చు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తరువాత అధిష్టానంతో చర్చించి ఈ రెండు స్దానాలకు అభ్యర్దుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version