YS Sharmila: ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్ (YS Sharmila)
ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పేపర్ లీకేజీ ఘటనపై.. విద్యార్ధులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వ పెద్దలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పేపర్ లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు. ఇందులో పెద్ద వ్యక్తులను తప్పించి.. చిన్నవాళ్లను దోషులుగా చిత్రకరించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
అభ్యర్ధుల తరపున.. కమిషన్ ఎదుట ఆందోళన చేస్తామంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
బయటకు వెళ్లాలన్న.. ఇతర కారణాలు చెప్పి తనను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.
తన ఇంటి వద్ద పోలీసులను మోహరించి.. ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినల్‌నా? అని షర్మిల ప్రశ్నించారు.
ఈ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ ఘనటపై.. విచారణకు డిమాండ్ చేస్తూ వెఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది.
నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది.
ఇక తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్.. ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ – డీఏవో, ఏఈ జనరల్ స్టడీస్ వంటి పరీక్షలతో పాటు.. జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని నిందితులుగా చేర్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు లక్షల్లో నగదు మార్పిడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పేపర్ లీకేజీలో నగదు లావాదేవీలపో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులోకి ఈడీ కూడా ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి.