Prime9

Minister KTR Meeting: స్టేజ్ పైకి దూసుకెళ్లిన యువకుడు

Rajanna sirisilla: ఐటి మంత్రి కె. తారకరామారావు వున్న స్టేజి పైకి ఓ యువకుడు దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయిన సంఘటన వేములవాడలో నిర్వహించిన వజ్రోత్సవాల సభలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు ప్రభుత్వ పధకాల్లో ఒకటైన డబల్ బెడ్ రూం ఇల్లు తనకు ఇప్పించాలంటూ ఈ ఘటనకు పాల్పడ్డాడు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కళాశాల మైదానం, వేములవాడ గుడి చెరువు మైదానంలో సభలు నిర్వహించారు. వందల మంది పోలీసులు ఉన్నప్పటికి యువకుడు స్టేజీ పైకి దూసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న కారణంగా సిఐఎస్ఎఫ్ భవనాన్ని కూడా తెలంగాణ డీజీపి ప్రారంభించి వున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సభలో అనామకుడు స్టేజీ పైకి దూసుకెళ్లడం పై పోలీసులు నిఘా పనితీరుపై సర్వత్రా విమర్శలకు తావిచ్చిన్నట్లైయింది.

Exit mobile version
Skip to toolbar