Suicide: రోజురోజుకు సాంకేతికత ఎంత పెరుగుతున్న చాలా మందిలో మూఢ నమ్మకాలు ఇంకా తొలగిపోవట్లేదు. ఓ మహిళ దేవుడు కలలో చెప్పాడని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది.
కిరోసిన్ పోసుకుని..
రోజురోజుకు సాంకేతికత ఎంత పెరుగుతున్న చాలా మందిలో మూఢ నమ్మకాలు ఇంకా తొలగిపోవట్లేదు. ఓ మహిళ దేవుడు కలలో చెప్పాడని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. కలలో దేపుడు చెప్పాడని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌లో శివాని (35) అనే మహిళ బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తనపై తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.