Site icon Prime9

MLA Durgam Chinnayya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు

mla durgam

mla durgam

MLA Durgam Chinnayya: బీఆర్ఎస్ నేత.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారని.. మహిళ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచిర్యాలలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.

సాయం చేస్తా.. సరదా తీర్చండి! (MLA Durgam Chinnayya)

బీఆర్ఎస్ నేత.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారని.. మహిళ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచిర్యాలలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తమ వద్ద నగదు తీసుకొని.. తమ మీదే కేసులు పెట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో వీడియోను మహిళ విడుదల చేసింది.

ఇందులో మహిళ ఎమ్మెల్యే లైంగిక ఆరోపణలు చేశారు. తమ వద్ద పని చేసే మహిళను పంపించాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపింది. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం.

కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు.

దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు.

తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు.

నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని చెప్పింది.

ఇదే విషయం ప్రశ్నిస్తే.. తమపై అక్రమంగా కేసులు పెట్టారని బాధిత మహిళ ఆరోపించింది. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి.

వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది.

నాకు మీడియా సపోర్ట్‌ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి అని శైలజ విజ్ఞప్తి చేశారు.

నాపై దుష్పప్రచారం చేస్తున్నారు

మహిళ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు. కావాలనే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.

డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. అని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.

ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలోప్రచారం అవుతున్న ఫోన్ నంబర్ తనది కాదే కాదని పేర్కొన్నారు.

దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar