Site icon Prime9

Warangal: యువకుడి వేధింపులు తాళలేక.. బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణం

warangal suicide

warangal suicide

Warangal: యువకుడి వేధింపులు తాళలేక బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత అనే అమ్మాయి బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

యువకుడి వేధింపులు.. (Warangal)

యువకుడి వేధింపులు భరించలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన.. వరంగల్‌ లో చోటుచేసుకుంది. రక్షిత అనే అమ్మాయి.. నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. యువతి గ్రామానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి.. కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమెకు సంబంధించిన చిత్రాలను.. సోషల్ మీడియాలో పెడతానని భయానికి గురిచేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యువకుడి వేధింపుల గురించి ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ సారి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. అదే పనిగా వేధించడంతో.. యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

 

ప్రేమికుడితో దిగిన ఫొటోలు వైరల్‌

యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అంచన వేస్తున్నారు. రాహుల్ అనే యువకుడితో రక్షిత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. రాహుల్ తో దిగిన ఫోటోలను.. మరో యువకుడికి పంపినట్లు తెలిసింది. ఇద్దరు కలిసి యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మెుదలు పెట్టారు. ఆ చిత్రాలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. యువతి మనస్తాపానికి గురై అత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ రక్షిత తండ్రి ఈ నెల 22న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల అనంతరం రక్షిత ఆచూకీ లభించింది. ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను వేరొకరికి పంపిన విషయం.. ఇతర వివరాలు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపేశారు. సరదాగా తీసుకున్న ఫొటోలు.. వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన రక్షిత తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ర్యాగింగ్‌ ఆరోపణలు అవాస్తవం..

పబ్బోజు రక్షిత అనే విద్యార్థి ఆత్మహత్యపై ర్యాగింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. రెండేళ్లుగా తమ కళాశాలలోనే చదువుతుందని.. కానీ బ్యాక్‌లాగ్‌లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్‌ అయిందని యాజమాన్యం చెప్పుకొచ్చింది.ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదని.. అలాంటి విద్యార్థినిని ఎవరు ర్యాగింగ్‌ చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని తెలిపింది.

 

Exit mobile version