Site icon Prime9

KTR : గీతకార్మికులకు మోపెడ్‌లు ఇస్తాము..మంత్రి కేటీఆర్

Minister KTR

Minister KTR

Telangana: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కులవృత్తులను బలోపేతం చేస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలోవైన్‌ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామని, కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామని, చెట్ల పన్నును రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామని, గీత కార్మికులకు కూడా ప్రతినెలా రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామని, ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామని తెలిపారు. గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

విద్యుత్, నీటి కొరత సమస్యల్ని నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్‌కు సరకు లేదు.. పేదల సమస్యలపై సోయి లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు, ఇతర పన్నుల ద్వారా రూ.30 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఒక్కరి ఖాతాలోనే జిల్లా వాసులందరి డబ్బులు పడ్డట్టుగా వున్నాయంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ సెటైర్లు వేసారు.

అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ కటకట ఉండేదని, సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో కరెంట్‌ సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని, ప్రాజెక్టులు, ఉచిత కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Exit mobile version