Site icon Prime9

Telangana: దేశంలో రైతులందరికి ఉచిత కరెంట్ ఇస్తాం.. సీఎం కేసీఆర్

We will give free electricity to all the farmers in the country.. CM KCR

We will give free electricity to all the farmers in the country.. CM KCR

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఉన్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిజామాబాద్ వేదికగా రైతులకు కోరారు. బీజేపీ ముక్త భారత్ ను నిర్మిద్దామని.. యావత్ భారత్ రైతాంగానికి తెలంగాణ మాదిరిగానే.. ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం మెదలు పెడదామని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొత్తగా మోటర్ల దగ్గర మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారి మండిపడ్డారు. మీటర్లు పెట్టి ప్రజల దగ్గర ఉన్న భూమిని లాక్కోవాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. రైత వ్యతిరేక విదానం అవలంభిస్తోన్న ఏ పార్టీనైనా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. రూపాయి పతనమై పోయిందని అన్నారు.

పచ్చగా ఉన్న దేశంలో మంటలు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. జిల్లాలో కట్టిస్తోన్న కాల్వలన్నీ త్వరలోనే పూర్తి అవుతాయని హామీ ఇచ్చారు. కడుతున్న కొత్త కాల్వల్లో నిజాం సాగర్, సింగూరు నీళ్లు పారాలా..? మతపిచ్చితో చెలరేగే నెత్తురు పారాలా అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా మొత్తం పచ్చని పంటలతో శశ్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.

Exit mobile version