Site icon Prime9

TRS Party: పార్టీ పేరు మారుస్తున్నాం…అభ్యంతరాలుంటే తెలపండి… తెరాస బహిరంగ ప్రకటన

We are changing our party name, if anyone has objections let us know

Hyderabad: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. పార్టీ పేరును “భారత్ రాష్ట్ర సమితి” గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పేరిట ఈ ప్రకటన జారీ అయింది. పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని అందులో సూచించారు.

ఎన్నికల సంఘం నిబంధన మేరకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పేరు మార్పు, తదితర సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతోపాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Supreme Court: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

Exit mobile version