Site icon Prime9

Munugode: పోస్టర్ల దుమారం.. “నేడే విడుదల, మేం మోసపోయాం” అంటూ గోడపత్రికలు

wall poster against bjp in munugode

wall poster against bjp in munugode

Munugode: తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే నియోజకవర్గ వ్యాప్తంగా గోడపత్రికలు వెలిశాయి. చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో దుకాణాలు, గోడలపై “మునుగోడు ప్రజలారా, మేం మోసపోయాం, మీరు మోసపోకండి” అంటూ దుబ్బాక, హుజూరాబాద్‌ ప్రజల పేరుతో ఈ వాల్ పోస్టర్లను పట్టణమంతా అంటించారు.
ఇదిలా ఉండగా చౌటుప్పల్‌ మండలం పక్కనే ఉన్న సంస్థాన్‌ నారాయణపురంలో బీజేపీ తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రచారం నిర్వహిస్తుండటం
గమనార్హం. ఇక చండూరు పట్టణంలో “షా ప్రొడక్షన్స్‌ సమర్పించు 18 వేల కోట్లు సినిమా, సత్యనారాయణ 70 ఎంఎం థియేటర్‌లో నేడే విడుదల, అందరూ చూడాలని” పోస్టర్‌పై రాశారు. ఈ సినిమాకు కోవర్ట్‌ రెడ్డి దర్శకత్వం వహించారంటూ పట్టణమంతా పోస్టర్లు అంటించి ఉన్నాయి. మొత్తానికి మునుగోడులో పోస్టర్ల అంశం తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: దత్తత తీసుకొనే దమ్ము టీఆర్ఎస్ అభ్యర్ధికి లేదా? భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి

Exit mobile version