Site icon Prime9

VRA Protest: పే స్కేలు వెంటనే ఇవ్వాలంటూ రోడ్డెక్కిన విఆర్ఏలు

VRAs are on the road

VRAs are on the road

Hyderabad: సీఎం కేసిఆర్ పేస్కేల్ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విఆర్ఏలను ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకొంటున్నారు. ఇందిరా పార్క్ నుండి వందలాది మంది విఆర్ఏలు అసెంబ్లీ వైపు దూసుకు రాగ, వారిని పోలీసులు అడ్డుకొంటున్నారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైవోవర్, రవీంధ్రభారతి ప్రాంతాల్లో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో తీవ్ర ఉధ్రిక్తతకు దారితీసింది. మరో వైపు అసెంబ్లీలో విఆర్ఏల సమస్యలపై కేటిఆర్ తో చర్చించేందుకు ఆయన కొంతమందికి అనుమతి ఇచ్చారు. 18 లేదా 20 తేదీలోగా పే స్కేల్ సమస్యను పరిష్కరించేందకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నకేటిఆర్, ముట్టడి ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆందోళనకారులను కోరారు.

మరో వైపు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ మత్య్సకార సంఘ విభాగంతో పాటుగా రెడ్డి సంఘం కూడా రోడ్డెక్కాయి. చేపల టెండర్లను ఏపి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. 2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకరించాలంటూ రోడ్డెక్కడంతో పోలీసులకు చమటలు పట్టించింది. సీఎం కాన్వాయ్ ను అడ్డుకొంటారన్న అనుమానంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ తోపాటుగా స్థానిక వ్యాపార సముదాయలను మూయించడం పట్ల చాలా మంది ప్రభుత్వ అసమర్ధ చర్యగా అభివర్ణించారు.

రాష్ట్ర ప్రజలు పేర్కొన్న అన్ని సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని ఊపదంపుడు మాటలు మాట్లాడుతున్న టిఆర్ఎస్ మంత్రులు విఆర్ఏల న్యాయమైన సమస్య పై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.

Exit mobile version