Site icon Prime9

Vikarabad Dist: వికారాబాద్ లో మంచు తుఫాన్ వచ్చిందా..?

Vikarabad Dist

Vikarabad Dist

Vikarabad Dist: వికారాబాద్ జిల్లా లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వ‌డ‌గండ్ల వాన‌ కురిసింది. ఎటు చూసినా వండగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పంట పొలాల్లో వ‌డగండ్లు నిండిపోవడంతో మంచు తుఫాను వచ్చిందా అన్నట్లుగా కనిపించింది.

రోడ్డుపై కూడా భారీగా వ‌డ‌గండ్లు ఉండిపోవ‌డంతో ఆ రోడ్లపై ప్ర‌యాణిస్తున్న వాళ్లు ఓ కొత్త‌ అనుభూతిని పొందుతున్నారు.

ఎండిపోయిన చెట్ల మ‌ధ్య నిండిపోయిన వడ‌గండ్ల‌తో వికారాబాద్ కే కొత్త అందం వ‌చ్చింది అనుకుంటున్నారు. భారీగా పేరుకుపోయిన వడ‌గండ్ల‌ను చూసి స్థానికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

మంచు మ‌యంగా..(Vikarabad Dist)

వికారాబాద్ జిల్లా ప‌రిధిలోని మ‌ర్ప‌ల్లి మండ‌లంలో గురువారం మ‌ధ్యాహ్నం భారీ వడ‌గండ్ల వాన దంచి కొట్టింది. ఈ భారీ వ‌డ‌గ‌ళ్ల వాన‌కు ఆ ప్రాంతమంతా మంచు మ‌యంగా మారింది. మ‌ర్ప‌ల్లి మండ‌లంలోని అన్ని గ్రామాల్లో ఇదే ప‌రిస్థితి.

భారీ వ‌డగండ్ల వాన‌కు కార్లు కూడా దెబ్బ‌తిన్నాయి. కార్ల అద్దాలు ప‌గిలిపోయాయి. భారీ స‌మూహాలుగా ఏర్ప‌డిన వ‌డగండ్ల‌తో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన కురవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ వడగండ్ల ధాటికి మామిడి పంట‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. మామిడి కాయ‌లు నేల‌రాలాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

దాదాపు 100 ఎకరాల్లో ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కూరగాయల పంటలు 70 శాతం దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.

https://youtu.be/vCo_SlJuKXM

 

 

Exit mobile version