Site icon Prime9

Vijaya Shanthi: ఎందుకు సైలెంట్‌లో పెట్టారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి.. విజయశాంతి

vijayashanthi

vijayashanthi

Hyderabad: బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పై తాను అసంతృప్తిగా ఉన్నట్టు బీజేపీ సీనియర్‌ నేత విజయశాంతి అన్నారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. జాతీయ నాయకత్వంతో తనకు ఎలాంటి సమస్య లేదని, రాష్ట్ర నాయకత్వమే తనను సరిగ్గా వాడుకోవడంలేదన్నారు. ఏ పని చెప్పకుండా పని చేయడంలేదనే ముద్ర తనపై వేస్తున్నారన్నారు. టీం వర్క్‌ చేస్తేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. జాతీయ నేతలు తెలంగాణలో ఉన్న పరిస్థితుల పై దృష్టి పెట్టాలన్నారు.

తనను ఎందుకు సైలెంట్‌లో పెట్టారో బండి సంజయ్, లక్ష్మణ్‌ కే తెలియాలని విజయశాంతి అన్నారు. ఎన్నికలు ఉంటే తప్ప కేసీఆర్ కు అభివృద్ధి గుర్తుకు రాదన్నారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్‌ రెడ్డికి సరైన స్థానం దొరకలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మునుగోడులో తప్పకుండా గెలుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసారు. పార్టీ నిర్ణయం మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. తనను బీజేపీలో కేవలం గెస్ట్‌ గానే చూస్తున్నారని, తన సేవలను పార్టీ వాడుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar