Site icon Prime9

Telangana: అక్కడ మాత్రమే స్పెషల్.. కూరగాయలు కేజీ రూ. 20.. ఎగబడుతోన్న జనం

veggies market

veggies market

Telangana: రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు అన్నీ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. ఏ కూరగాయ కొనాలన్నా కేజీ 60 రూపాయలపైనే ఉంది. ఇక ఇటీవలె కాలంలో టమాటాలు అయితే బంగారంలా మారిపోయాయి. పట్టుకుందాం అంటే భయం.. ముట్టుకుందామంటే మంట అంతలా భగ్గుమంటున్నాయి వీటి ధరలు. పెద్దపెద్ద మార్కెట్లు సైతం టమాట విక్రయాన్ని తగ్గించేశాయి. దాదాపు 200 అంతకంటే ఎక్కువే ధరల పలుకుతున్న టమాటాలను మధ్యతరగతి ప్రజలు కూరల్లో వెయ్యడమే మానేశారు. ఇంక రెస్టారెంట్లు హోటళ్లు అయితే నో టమోటో ఫుడ్స్ అంటూ బోర్డ్ పెట్టాశాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి మాత్రం కేజీ రూ.20లకే కూరగాయలు విక్రయిస్తున్నాడు. ఎక్కడో కాస్త చెప్పండి మేము కూడా వెళ్లి తెచ్చుకుంటాం అనుకుంటున్నారు కదా.. మరి అతను ఎందుకు ఇంత తక్కువ ధరకు కూరగాయలు అమ్ముతున్నాడో తెలుసుందాం రండి.

ఎందుకు అంత తక్కువంటే(Telangana)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎస్ కే గౌస్ అనే కూరగాయల వ్యాపారి తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. టమాటా, పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయలన్నింటిని కేజీ 20 రూపాయలకే విక్రయిస్తున్నాడు. ఇల్లందులో బెండకాయ, వంకాయ, కాకరకాయ, దొండకాయ వంటి కూరగాయలు మార్కెట్‌లో కేజీ 60 రూపాయలుపై మాటే రేట్లు పలుకుతుండగా.. తాను మాత్రం రూ.20కే అమ్మకాలు చేస్తున్నానని విక్రయదారుడు చెప్తున్నాడు. పేద, సామాన్య ప్రజలకు భారం లేకుండా ప్రతి నిరుపేదలు కూరగాయలను కొని మంచి ఆహారం తీసుకుంటారని టమాటా, పచ్చిమిర్చి మినహా.. మిగిలిన కూరగాయలు కేజీ 20 రూపాయలకే అమ్ముతున్నానని అతను చెప్పుకొచ్చారు. ఇదే అదునుగా వినియోగదారులు సైతం ఎగబడి అతని వద్ద కూరగాయలు కొంటున్నారు.

కూరగాయలు రేట్లు తగ్గే వరకు వాటి మీద ఎటువంటి లాభం లేకుండా తాను అమ్మకాలు జరుపుతానని గౌస్ అంటున్నారు. ప్రజలు ఇబ్బంది లేకుండా తక్కువ ధరకే కూరగాయలు అమ్ముతూ గౌస్ ఔదార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Exit mobile version