Site icon Prime9

కిడ్నాప్ కేసు : రాజన్న సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్… పెళ్లి వీడియో రిలీజ్ చేసిన యువతి !

unexpected twist in rajanna sirisilla kidnap case and videos goes viral

unexpected twist in rajanna sirisilla kidnap case and videos goes viral

Kidnap Case : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్‌ కేసు ఊహించని ట్విస్ట్ తో సుఖాంతం అయ్యింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని… ఆమెను తీసుకెళ్లింది తన లవర్ ఏ అని చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తిని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్ట లేకపోయానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఉదయం కొంత మంది దుండగులు షాలినీ అనే యువతిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

చందుర్తి మండలం మూడపల్లిలో గోలి షాలిని అనే యువతిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. నిందితులు ముసుగులు ధరించి… వారికి అడ్డొచ్చిన యువతి తండ్రిపై కూడా దాడి చేశారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే, కిడ్నాపైన యువతి తాజాగా తానేం కిడ్నాప్ కాలేదని, తను ప్రేమించిన జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. తన తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణహాని ఉన్నట్లు వీడియోలో పేర్కొంది.

జానీని తాను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లానని షాలిని చెప్పడం గమనార్హం. తన కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వచ్చేసినట్లు వివరించింది. ప్రస్తుతం జానీ-షాలినీ రహస్య ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. గతేడాది ఙ్ఞానేశ్వర్‌ని పెళ్లి చేసుకున్నానని.. అయితే మైనర్‌ కావడంతో తన పేరెంట్స్‌ అభ్యంతరం చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను జైలుకెళ్లాడని వివరించింది శాలినీ. ఇప్పుడు ఇద్దరం మేజర్లమేనని అందుకే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Exit mobile version