Hyderabad: తెలంగాణ విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల చేశారు. మొత్తం పరీక్షలకు 1,14,289 మంది హాజరు అయ్యారు. వీరిలో సప్లిమెంటరీ పర్సంటేజ్ 47.74% గా ఉండగా ఒకేషనల్ 65.07% పాస్ ఐనట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ మొత్తం కలిపి రెగ్యులర్, సప్లిమెంటరీ 80.80 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. విద్యార్థులు ఫలితాలు ఎలా చూసుకోవాలా అని ఆందోళన చెందకండి. మీ ఫలితాలను చూసుకోవడానికి క్రింద ఇచ్చిన వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి మీ ఫలితాలను తెలుసుకోండి.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ ఐనా విద్యార్థులకు ఆగస్టు 1 వ తారీఖు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మంగళవారం అనగా నేడు తెలంగాణ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
వచ్చే నెల సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు మరొక అవకాశంగా రీకౌంటింగ్‌కు ప్రక్రియ కూడా కొనసాగనుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. నేడు మంగళవారం సాయంత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా ఇంటర్ బోర్డ్ విడుదల చేయనున్నారని తెలిసిన సమాచారం.