Site icon Prime9

TRS Party: ఎన్నికల గుర్తుపై కోర్టు మెట్లెక్కిన తెరాస

TRS will go to court on the election symbol

TRS will go to court on the election symbol

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు  మెట్లెక్కింది.  కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది. కెమెరా, చపాతీ రోలర్‌, డాలీ, రోడ్‌ రోలర్‌, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్‌, ఓడ గుర్తుల వల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడుతోందని తెలిపింది. వాటిని ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది.

తమ అభ్యంతరంపై ఎన్నికల కమీషన్ స్పందించడం లేదని హైకోర్టును తెరాస ఆశ్రయిస్తోంది. ఈ విషయంలో నిన్నటిదినం తెలంగాణ హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం అత్యవసర విచారణకు నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Munugode by poll: తెరాసకు జలక్ ఇస్తున్న కుల సంఘాలు

Exit mobile version