Medical colleges: తెలంగాణలో రేపు 8 మెడికల్ కాలేజీల ప్రారంభం

తెలంగాణలో నూత‌నంగా నిర్మించిన 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 మెడిక‌ల్ కాలేజీల్లో విద్యాబోధ‌న త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌నున్నారు.

  • Written By:
  • Publish Date - November 14, 2022 / 08:13 PM IST

Hyderabad: తెలంగాణలో నూత‌నంగా నిర్మించిన 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 మెడిక‌ల్ కాలేజీల్లో విద్యాబోధ‌న త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌నున్నారు.

దాదాపు 4080 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నీట్‌ -2022కు అర్హత సాధించిన విద్యార్థులకు ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన ప్రారంభం కానుంది. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేసి మెడికల్‌ కాలేజీలకు అనుసంధానం చేశారు. ఈ ఎనిమిది మెడికల్‌ కాలేజీల ప్రారంభంతో ఈ విద్యా సంవత్సరంలో 1150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో ఆ సంఖ్య 2091కి చేరింది.