Hyderabad: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బకెట్ నీటి కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమిషాల వ్యవధిలో ఈ ముగ్గురు చనిపోవడం తీరని విషాదాన్ని నింపింది. మెుదట ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురికాగా.. అతడిని కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది.
తీరని విషాదం.. (Hyderabad)
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బకెట్ నీటి కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమిషాల వ్యవధిలో ఈ ముగ్గురు చనిపోవడం తీరని విషాదాన్ని నింపింది. మెుదట ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురికాగా.. అతడిని కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది.
నీళ్ల కోసం వెళ్తే కన్నీళ్లే మిగిలాయి. బకెట్ నీళ్ల కోసం వెళ్లిన యువకులు నిమిషాల వ్యవధిలో మృత్యు ఒడికి చేరుకున్నారు.
దీనికి కారణం వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వీరితో పాటు స్నేహితుడు కూడా మృతి చెందాడు.
మహమ్మద్ అనే వ్యక్తి కుటుంబం పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటుంది. మోటారు పనిచేయక ఇంట్లోకి నీరు రాకపోవడంతో మహమూద్ కుమారులు బకెట్లు తీసుకొని కిందకు వెళ్లారు.
నీటి కోసం సంపులోకి దిగారు. కానీ మోటారు ఆన్ చేసి ఉన్న విషయాన్ని వీరు గమనించలేదు.
సంపులోనే అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఎంతకి వీరు బయటకి రాకపోవడంతో.. వారి స్నేహితుడైన సయ్యద్ అనాసుద్దీన్ సంపులోకి దిగుతుండగా షాక్ తో అందులో పడి మృతిచెందాడు.
ఇది గమనించిన ఉమేరా ఫాతిమా గట్టిగా అరించింది. వెంటనే కాపలాదారు చిలుక రాజయ్య అక్కడికి చేరుకొని మోటారు ఆఫ్ చేశారు.
స్థానికులు ఆ ముగ్గురినీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిజ్వాన్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, రజాక్ పదో తరగతి, అనాసుద్దీన్ డిగ్రీ చదువుతున్నాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చేతికొచ్చిన ఇద్దరు కొడుకులు మరణించడంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో పడిపోయింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.