Hyderabad: తెలంగాణలో రాజ్యాంగం, పరిపాలన వ్యవస్ధల్లో ఏర్పడిన జాప్యం కారణంగా సామాన్య ప్రజలు సతమతమౌతున్నారు. అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కార్యాలయంకు చేరిన పరిపాలన బిల్లుల ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్ర దగ్గర ఆగిపోయాయి. కారణాల పై ఇటు రాజభవన్, అటు సంబంధిత మంత్రులకు లేఖాస్త్రాలు సాగుతూ వ్యవహారాన్ని మరింత ముదిరేట్టుగా చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నియామకాల బిల్లు పై కొంత అయోమయానికి గురైయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాజభవన్ నుండి మంత్రి సబితా రెడ్డి కార్యాలయంతో పాటు యూజీసికి లేఖలు వెళ్లాయి. అయితే తమకు ఎలాంటి లేఖలు అందలేదని మంత్రి సబిత మీడియాతో పేర్కొన్నారు. లేఖలు పంపామంటూ తప్పుడు సమాచారం ఇవ్వడం ఏంటని ఆమె గవర్నర్ ను ప్రశ్నించారు.
సబిత వ్యాఖ్యలకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్ ఇచ్చింది. నిన్నటిదినం మెసెంజర్ ద్వారా మంత్రికి సమాచారం ఇచ్చామని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం రాజ్‌భవన్ పై కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. తక్షణమే రాజ్‌భవన్‌కు వచ్చి వాటన్నింటి పై వివరణ ఇవ్వాల్సిందిగా సమాచారం పంపించామని రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సమాచారం అందలేదని మంత్రి చెప్పడం సరికాదంది.
ఇది కూడా చదవండి: Hyderabad: మీర్ పేట్ లో బాలిక పై గ్యాంగ్ రేప్.. పరారీలో నిందితులు