Site icon Prime9

YS Sharmila: వైఎస్‌ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత.. తోపులాటలో కిందపడిన షర్మిల

ys sharmila arrested due to shocking comments on brs mla

ys sharmila arrested due to shocking comments on brs mla

YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.

కిందపడిపోయిన షర్మిల..

హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు. వైఎస్ షర్మిల ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను చూడాలనుకున్నారు. దీంతో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. దీంతో వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. షర్మిల కిందపడిపోయారు. పోలీసులు అడ్డుకున్న అనంతరం షర్మిల మాట్లాడారు. తమ నేతలను ఎక్కడికి వెళ్లకుండా పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంత అని మరోసారి నిరూపితం అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సీఎం నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Exit mobile version