TS New Secretariat: నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు

కోట్ల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర పాలనలో సచివాలయానికి ప్రత్యేకత ఉందన్నారు. దేశ చరిత్రలో సామాజిక దర్శకుడిగా కితాబులందుకొంటున్న అంబేడ్కర్ పేరు పెట్టడం ప్రజలందరికి గర్వకారణంగా చెప్పుకొచ్చారు. ఆయన యావత్తు భారత దేశానికి ఆదర్శం సీఎం పేర్కొన్నారు. ఆ మహాశయునీ అడుగు జాడల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తు చేసారు. అందుకే అంబేడ్కర్ పేరును పెట్టేందుకు సిద్దమైన్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడంలో అంబేడ్కర్ దార్శనీయుత ఉందని అభిప్రాయపడ్డారు.

కొద్ది రోజుల కిందట నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఆయన తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ వ్యాప్తంగా చర్చగా మారింది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న కేసిఆర్ ఆ మాటల పై నిలబడలేకపోయారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసిఆర్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు తాజాగా అంబేడ్కర్ పేరును సచివాలయానికి ఖరారు చేసారని ప్రజలు భావిస్తున్నారు.