Site icon Prime9

Telangana: తెలంగాణ ఇంటెలిజెన్స్ మరోసారి ఫెయిల్

ts-intelligence-failure-vra-protest

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఆందోళనలకు సంబంధించి సమాచారం అందితే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తుంటారు. దాంతో అలెర్ట్ అయ్యే పోలీసులు ఆందోళనకారులు అసెంబ్లీ దరికి చేరకుండా కట్టడి చేస్తుటారు. ఆ క్రమంలో వీఆర్ఏల ఆందోళనకు సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్ ముటగట్టుకుందన్న అపవాదు ఎదుర్కొంటోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా అధికారులు చూడాల్సి ఉంటుంది. ఏవైనా ఆందోళనలు జరుగుతాయనుకుంటే వాటిని ముందుగానే పసిగట్టి పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం అలెర్ట్ అయి ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇబ్బంది లేకుండా చూస్తుంటారు. అయితే వీఆర్ఏలు తెలంగాణ వ్యాప్తంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ తెలంగాణ ఇంటెలిజెన్స్ మాత్రం పసిగట్టలేక పోయిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

అదలా ఉంటే వీఆర్ఏలది అర్థంలేని ఆందోళన చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం శాసనసభలో వీఆర్‌ఏల సమస్యలను ప్రస్తావించగా అందుకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం మానవీయ కోణంలో వీఆర్‌ఏలను ఆదుకుందని, వారి వేతనాలను పెంచిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే కింది స్థాయి ఉద్యోగులకూ వేతనాలు పెంచామని, నాన్‌ స్కేల్‌ వారికి దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా జీతాలు పెంచామని అన్నారు. వీఆర్‌ఏల్లో అర్హత ఉన్నవారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని గతంలోనే ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అర్హులైన వారిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేస్తామన్నారు. ఇందుకోసం సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీని వేశామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరి సీఎం ఆ అభిప్రాయాంతో ఉంటే వీఆర్ఎలు అంత పకబ్బందీగా ఎందుకు రోడ్డెక్కారన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానం లేదు. అసెంబ్లీ సమావేశాలకు మూడు రోజుల ముందుగానే వీఆర్ఏలు అంతా బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏ బంధువులలో మూడు రోజుల నుంచి మకాం వేశారు. అయినా తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించలేదు. ఫలితంగా నేడు విడతల వారీగా 6000 మంది వచ్చి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. చివరకు మంత్రి కేటీఆర్ కల్పించుకుని వీఆర్ఏ ప్రతినిధులతో మాట్లాడటంతో కాస్త శాంతించారు. మరి కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తంచేయడం ఎందుకో ఆయనకే తెలియాలి.

మరోవైపు అగ్నిపథ్ ఆందోళనల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ముందుగా పసిగట్టలేకపోయింది. ఫలితంగా వేల మంది విద్యార్థులు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌పై పడి ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. బాటిళ్లతో పెట్రోల్ తీసుకొచ్చి పలు ట్రైన్‌లను తగులబెట్టారు. ఫలితంగా రైల్వే కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వేల సంఖ్యలో వీఆర్ఏలు ఒక్కసారిగా వచ్చి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీనికి కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి.

Exit mobile version