Site icon Prime9

Home Minister Mahmood Ali: బీజేపీ రౌడీ రాజకీయాలు చేస్తోంది.. హోంమంత్రి మహమూద్‌ అలి

Hyderabad: తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్‌ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో అభివృద్ధికి తప్ప అశాంతికి తావు లేదన్నారు. హైదరబాద్‌లో యువత ఇష్టపడింది కాబట్టే మునావర్‌ ఫరూకీ షోకు అనుమతిచ్చామన్నారు. బీజేపీ రౌడీ రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని ఆయన స్పష్టం చేసారు.

రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని, తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ఆయన వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు కూడ కవిత నివాసానికి వచ్చి ఆమెను కలుసుకున్నారు.

Exit mobile version