Site icon Prime9

BJP President Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

Jangaon: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతల మధ్యనే బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కార్యకర్తలకు ఏదైనా జరిగితే సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించిన బండి సంజయ్‌ పాదయాత్ర శిబిరం వద్ద కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు, భద్రతా కారణాల దృష్ట్యా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా పలువురు కేంద్ర నేతలు బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

Exit mobile version