Hyderabad: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల పై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నెల మూడో తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతోపాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టిఆర్ఎస్ అనుసరించనున్న పాత్ర పై సిఎం కేసిఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయాన్ని ఎంఐఎం లేవనెత్తే అవకాశముంది. మరోవైపు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం, బీజేపీ నేతల యాత్రలను అడ్డుకోవడం పై వేడిగా చర్చలు సాగే అవకాశముంది.