Telugu Student: అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతుంది. తాజాగా టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మృతి చెందింది. ఉన్నత చదువుల కోసం టెక్సాస్ కోసం వెళ్లిన యువతి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
విద్య కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతుంది. తాజాగ టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మృతి చెందింది. ఉన్నత చదువుల కోసం టెక్సాస్ కోసం వెళ్లిన యువతి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
హైదరాబాద్ కు చెందిన తాటికొండ ఐశ్వర్వ అనే యువతి.. దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు విచారణ సంస్థలు ధ్రువీకరించాయి. టెక్సాస్‌లోని అలెన్ మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఐశ్వర్య అనే యువతి ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.
శనివారం జరిగిన కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందతూ.. యువతి మృతిచెందింది. యువతి కుటుంబ సభ్యులు కొత్తపేటలో నివాసం ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తెనే తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.