Site icon Prime9

Tarun Chugh: కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌: తరుణ్ చుగ్

Tarun Chugh

Tarun Chugh: తెలంగాణంలో బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ గా మారిందని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చెప్పిన విధంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని దీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి తీరుతాం (Tarun Chugh)

తెలంగాణంలో బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ గా మారిందని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చెప్పిన విధంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని దీమా వ్యక్తం చేశారు. సాధారణ పోలీసుల దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంపీ స్థాయి గల వ్యక్తిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్‌ అరెస్ట్ అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఉన్నామని.. ధర్మమే గెలిచిందని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ పోరాటం చేస్తున్నారు. తెలంగాణ యువత కోసం బండి సంజయ్ పోరాటం చేస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు.

విద్యార్థికి న్యాయం చేయాలి..

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే ఈ లీకేజీ ఘటనలో గురుకుల పాఠశాల విద్యార్థిని అయిదేళ్ల పాటు డిబార్‌ చేశారు.

అయితే దీనిపై బండి సంజయ్ స్పందించారు. బాధిత విద్యార్ధికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల కోసం విద్యార్ధి బతుకును నాశనం చేయవద్దని సూచించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే పేపర్ లీక్ అయినట్లు బండి సంజయ్ మరోసారి ఆరోపించారు.

అయితే ఈ పేపర్ లీకేజీ ఘటనలో తన తప్పేం లేదని బాధిత విద్యార్ధి ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులకు కోరాడు.

గుర్తు తెలియని వ్యక్తి బెదిరించి పేపర్ ఫోటో తీసుకున్నట్లు వివరించాడు. ఇదే విషయంపై బాధిత విద్యార్ధి తల్లి బోరున విలపించింది.

తమ కుమారుడికి న్యాయం చేయాలని అధికారులను కోరింది. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Exit mobile version