Statue controversy in Congress: కాంగ్రెస్ లో నూతన తెలంగాణ తల్లి విగ్రహం లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు

Hyderabad: తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ విమోచన దినంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతను చాటుకొనేందుకు సిద్దమైంది. కొత్తగా రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన రేపటిదినం అవిష్కరించనున్నారు. దీనిపై సీనియర్లు వద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైనా నాటి నుండి సీనియర్లు ఏదో ఒక కారణంతో ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్రనేత రాహుల్ గాంధీ ఆశీస్సులు రేవంత్ కు ఉండడంతో సీనియర్లను పెద్దగా రేవంత్ పట్టించుకోవడం లేదన్న వాదనలు లేకపోలేదు.

మరీ ముఖ్యంగా నియంతృత్వ ధోరణితో ప్రతిపక్షాల నోర్లను నొక్కేందుకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసిఆర్ పై ఎదురుదాడి కేవలం రేవంత్ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందన్న భావనను అధిష్టానం నమ్మడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.