Site icon Prime9

Pravalika Suicide : ప్రవళిక ఆత్మహత్య ఘటనలో ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వివరాలు తెలిపిన పోలీసులు

shocking details abhout pravalika suicide case

shocking details abhout pravalika suicide case

Pravalika Suicide : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గల హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన స్నేహితులు తిరిగి వచ్చి చూసే సరికి గదిలో ఉరి వేసుకుని ఉండడంతో హాస్టల్ మేనేజర్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని గ్రూప్ 2 పరీక్షలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రాణాలను తీసుకుంది అని వార్తలు రావడం గమనించవచ్చు.

ఇక అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత సొంత గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య ప్రవళిక అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రవళికది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి లను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. కొందరు ప్రవళిక ఆత్మహత్యను అదనుగా భావించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి, రాళ్లు రువ్వడం, ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేశారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా తాజాగా ఈ కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రవళ్లిక మరణానికి,  పరీక్షల వాయిదాకి సంబంధం లేదన్నారు. ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక సూసైడ్ కు కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలుసున్నారు. కోస్గి మండలానికి శివరాంకు ఈ మధ్య మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్నారు. ఈ విషయం తెలిసి మనస్థాపం చెందిన  ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. నిన్న ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారని, ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. నిన్న రాత్రి కూడా శివరాం రాథోడ్ తో మాట్లాడినట్లు, ఆమెతో పాటు రూంలో ఉన్న స్టూడెంట్లు తెలిపారని డీసీపీ వెల్లడించారు. 15 రోజుల క్రితమే హాస్టల్ లో చేరిందని, ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టం చేశారు.

సూసైడ్ లెటర్ లో ఏం రాసిందంటే..  

ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసిన లేఖ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లెటర్ లో  ‘అమ్మా నన్ను క్షమించు.. నేను ఓడిపోయాను, నా వల్ల నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు. ఏడవకండి జాగ్రత్తగా ఉండండి. నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం.. నన్ను చూసుకున్నారు. కానీ నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరూ క్షమించరు.. అమ్మా.. నాన్న జాగ్రత్త’ అని రాసింది.

Exit mobile version