Site icon Prime9

Cash seized: లిబర్టీ చౌరస్తాలో భారీగా నగదు పట్టివేత.. ఎంతంటే?

Seizure of huge cash in Liberty circle

Hyderbad: నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం పై నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. నారాయణగూడ పీఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ద్విచక్ర వాహనాన్ని వెంబడించారు. తనిఖీల్లో రూ. కోటి 27 లక్షలు నగదు పట్టుబడింది. గోల్నాకలో నివాసముండే మన్నే శ్రీనివాస్‌, ఉస్మాన్‌గంజ్‌కు చెందిన విశ్వత్‌శెట్టి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఫణికుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే వ్యాపార లావాదేవీల్లో నగదును తరలిస్తున్నారా లేదా మునుగోడు ఉప ఎన్నికల్లో నగదును పంచేందుకు తరలిస్తున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికలో భారీ బెట్టింగ్‌లు

Exit mobile version