Site icon Prime9

Suicide Note: అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. సాత్విక్ సూసైడ్ నోట్ వైరల్

sathwik

sathwik

Suicide Note: ఓ ప్రముఖ కళాశాలలో సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సాత్విక్‌ రాసుకున్న సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ఈ సూసైడ్ నోట్ ను సాత్విక్ జేబులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నోట్ లో తను అనుభవించిన బాధను రాసుకొచ్చాడు. ఆ నలుగురిని వదలొద్దంటూ సాత్విక్ రాసిన పేర్లు వైరల్ అవుతున్నాయి.

సూసైడ్ నోట్ లో నలుగురి పేర్లు.. (Suicide Note)

అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కాలేజీ ప్రిన్సిపల్, కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేష్‌ వేధింపులను తట్టుకోలేకపోయాను. ఈ నలుగురు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారుని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ నలుగురి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. క్షమించు అమ్మా.. నేను పడిన టార్చర్‌ ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నా. నన్ను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నాడు. అమ్మా నాన్న లవ్‌ యూ.. మిస్‌ యూ ఫ్రెండ్స్‌ అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ మాటలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.

క్లాస్ రూమ్ లో సూసైడ్..

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విన్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యపై కాలేజీ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్ధి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించేందుకు.. కాలేజీ సిబ్బందిని సాయం కోరగా పట్టించుకోలేదని విద్యార్ధులు ఆరోపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వహించారని ఆ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. తోటి విద్యార్థులు బయటి వాహనంతో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సాత్విక్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సాత్విక్ మృతిచెందడంపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు. గతంలో లెక్చరర్స్‌ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అప్పటినుంచి సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు సాత్విక్ తల్లిదండ్రులు తెలిపారు. కాలేజి సిబ్బంది స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు. అబ్బాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్‌ మృతిచెందాడని తోటి విద్యార్ధులు ఆరోపించారు. సాత్విక్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని సాత్విక్‌ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు.

సాత్విక్‌ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి సబిత

కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే తమ కుమారుడు ఆత్మహత్యాకు పాల్పడినట్లు సాత్విక్‌ తల్లి తీవ్రంగా విలపించారు. తన కొడుకును తనకు తెచ్చివ్వండని ఆమె రోదించిన తీరు అందరిని కలచివేసింది. ఈ క్రమంలో సాత్విక్ ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై మృతిపై విచారణకు మంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Exit mobile version