Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరు పరిచారు.
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరు పరిచారు. దీంతో తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. బండి సంజయ్ తో పాటు.. ప్రశాంత్, శివ గణేష్, మహయ్‌లను కూడా హాజరుపరిచారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బండి సంజయ్ ను తీసుకువెళ్లే క్రమంలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక మెజిస్ట్రేట్ ముందు వాడీవేడీగా వాదనలు సాగాయి. ఈ కేసులో మరింత విచారణ చేసేందుకు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. ఇక బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని.. అతడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు.