Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్.. బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు బండి సంజయ్ రాష్ట్ర మహిళ కమిషన్ ఎదుట హాజరయ్యారు.
వ్యాఖ్యలను సమర్థిస్తూ వివరణ (Bandi Sanjay)
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కమిషన్ ఎదుట.. బండి సంజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు. కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ వాడుక భాషలో ఉన్న పదాలనే తాను ఉపయోగించినట్లు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ.. రెండు పేజీల లేఖను ఆయన మహిళా కమిషన్ కు అందించారు. ఇక బండి సంజయ్ సమాధానాలపై మహిళా కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చేందుకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
మార్చి 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది.
మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ బండి సంజయ్ ను ఆదేశించింది.
అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున మీరు చెప్పిన తేదీల్లో హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు.
మార్చి 18న ఏ సమయంలోనైనా హాజరయ్యేందుకు సిద్ధమని చెప్పారు.
ఈ మేరకు బండి సంజయ్ ఇవాళ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి.
బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండిపై కేసు నమోదు చేశారు.