Road Accident : దసరా పండుగకు సొంతూరుకి వెళ్తుండగా ప్రమాదం.. తండ్రికూతుళ్ళు మృతి

వరంగల్ లో విషాదకర ఘటన జరిగింది. దసరా పండగను పురస్కారించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. ఊహించని ఈ ఘటనలో ఓ యువతి, ఆమె తండ్రి మరణించగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..  వరంగల్ జిల్లా కిష్టాపురం

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 12:26 PM IST

Road Accident : వరంగల్ లో విషాదకర ఘటన జరిగింది. దసరా పండగను పురస్కారించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. ఊహించని ఈ ఘటనలో ఓ యువతి, ఆమె తండ్రి మరణించగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..  వరంగల్ జిల్లా కిష్టాపురం మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఓరుగంటి వెంకన్న నివసిస్తున్నారు. ఆయనకు 33 ఏళ్ల అనూష అనే కూతురు ఉన్నారు. ఆమెకు ముంజపల్లి రాజు అనే యువకుడితో కొంత కాలం కిందట వివాహం జరిగింది. ఈ దంపతులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. దసరా కోసం ఆ జంట మొరిపిరాల గ్రామానాకి బయలుదేరింది.

కోసం ఓ యువతి తన భర్తను తీసుకొని స్వగ్రామానికి బయలుదేరింది. బస్సు దిగి బస్టాండ్ లో ఎదురు చూస్తున్నారు. కొంత సమయం తరువాత ఆ యువతి తండ్రి బైక్ పై వారి కోసం వచ్చారు. వారు ముగ్గురు బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆ బైక్ ను కారు ఢీకొట్టడంతో తండ్రీకూతుర్లు మరణించారు. దంపతులు ఇద్దరూ  హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి తొర్రూరు బస్ స్టాండ్ లో దిగారు. వారి కోసం వెంకన్న బైక్ పై తొర్రూరుకు చేరుకున్నారు. ఇద్దరినీ బైక్ పై ఎక్కించుకొని గ్రామానికి బయలుదేరారు. అయితే బైక్ కిష్టాపురం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఓ కారు ఢీకొట్టింది. దీంతో వెంకన్న ఘటనా స్థలంలోనే మరణించారు. అనూష, రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అనూష మరణించింది. రాజు ప్రస్తుతం చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబం అంతా సంతోషంగా పండగ జరుపుకోవాలని భావించిన తరుణంలో ఊహించని విషాదాంతో వారి కుటుంబ సభ్యులు అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.