Revanth Reddy: రాష్ట్రంలో పునర్ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే.. ఆ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఈ యాత్ర చేయనున్నారు. తెలంగాణలో తెరాస పాలన అంతమే లక్ష్యంగా ఈ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు..
తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకూ కాంగ్రెస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
ఇన్నాళ్లూ.. విమర్శలు.. సభలకే పరిమితమైన ఆ పార్టీ నేటి నుంచి పాదయాత్రకు సిద్దమైంది. మేడారం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.
ప్రత్యేక పూజల అనంతరం రేవంత్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుంది.
ఈ యాత్రతో ప్రజలకు మరింత దగ్గర అవుతామని.. కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.
ప్రజలు సెంటిమెంట్ గా భావించే.. మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.
ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు.
మేడారం నుంచి.. ప్రాజెక్ట్ నగర్ వరకూ పాదయాత్ర చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత.. మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు.
సాయంత్రం 5 వరకు ఈ యాత్ర సాగింది. అనంతరం.. పస్రా జంక్షన్‌లో కార్యకర్తల సమావేశం ఉంటుంది.
ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే హాజరయ్యారు.
సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
రామప్ప చేరుకోవడంతో.. తొలిరోజు పాదయాత్ర ముగుస్తుంది. తిరిగి ఈ పాదయాత్ర రేపు కొనసాగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పాదయాత్ర
ఇక రేవంత్ రెడ్డి Revanth Reddy పాదయాత్రతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకలు పాదయాత్రలు ఉండనున్నాయి.
సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొద్ది రోజుల క్రితం అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.
ఈ విషయం ఢిల్లీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో హైకమాండ్ దిగ్విజయ్ సింగ్‌ని రంగంలోకి దింపి.. గొడవలను సద్దుమణిగేలా చేసింది.
ఈ పాదయాత్ర వల్ల కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఈ యాత్రలో రేవంత్ రెడ్డి.. 50 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/