Revanth Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.

Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.

వారిని ఎలా పరీక్ష రాయనిస్తారు? (Revanth Reddy)

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ దారుణమని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. ఈ లికేజీతో పేద విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.

లీకైన పేపర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దీని వెకన ఎవరున్నారో తేల్చాలి..

ప్రభుత్వం చెబుతున్నట్లు ఈ వ్యవహారం వెనక ఇద్దరు మాత్రమే లేరని.. కేటీఆర్ అనుచరులు ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఇద్దరికే సంబంధం ఉందంటూ కేటీఆర్‌ అతి తెలివితేటలు ప్రదర్శించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు.

వారంతా ఎక్కడున్నారు?. 2015 నుంచి పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయి. అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిందితులు ఉన్న చంచల్ గూడ జైలుకు మధ్యవర్తిత్వం చేయడానికి ఎవరు వెళ్లారో అది ప్రజలకు తెలుసన్నారు. వారి పేర్లు బయటకి వస్తే.. చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు.

ఈ మేరకు చంచల్‌ గూడ సందర్శకుల జాబితాను చూపించాలని డిమాండ్ చేశారు. పేపర్‌ లీక్‌ వెనుక ఎవరున్నారో తేట తెల్లం చేయాలని కోరారు.

నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోక ముందే రాజశేఖర్‌, ప్రవీణ్‌ మాత్రమే నిందితులని కేటీఆర్‌ ఎలా నిర్దారించారు?.

టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు అని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్‌లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలి. టీఎస్పీఎస్సీలో పనిచేసే మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం‌, రజనీకాంత్ రెడ్డికి నాల్గో ర్యాంక్ రావడం వెనుక కారణాలేంటో తెలియాలి. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారిలో 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనుక ఏం జరిగిందో తేలాలి. నిందితులందరి పూర్తి వివరాలు వెల్లడించాలి. సిట్ దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదంటూ కీలక వాఖ్యలు చేశారు. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు కోర్టును మేం కోరతాం. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు.