Munugode: ఉద్యమ పార్టీ తెరాస మునుగోడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొనింది. తమ పార్టీ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డిని మునుగోడు ఓటర్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. తన సమీప భాజపా అభ్యర్ధిపై 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని అందుకొన్నారు.
నెలరోజుల నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలు ఆధ్యంతం మాటలు తూటాలుగా, మద్యం ఏరులై, నగదు ప్రవాహంగా సాగింది. కీలక నేతలు, మంత్రులే స్వయంగా ఓటర్లను తమ పార్టీల వైపు మళ్లించుకొనేందుకు స్థాయిని మరిచి మరీ వ్యవహరించారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితంమైన్నట్లుగా పేర్కొంటున్న ప్రతిపక్షాలపై అధికార పార్టీ శ్రేణులు దాడులు దిగి మరీ తెగించారు. చివరకు మునుగోడు ఓటర్లు తీర్పును ఇచ్చి నేటి ఎలక్షన్ కు బైబై చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇంక సై అంటున్నారు. మంత్రి కేటిఆర్ పేర్కొన్నట్లుగా మునుగోడును ఇంక ఆయన దత్తకు తీసుకోనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు | |||||||
రౌండ్ల వారీగా | తెరాస | భాజపా | కాంగ్రెస్ | ||||
1 | 6418 | 5126 | 2100 | ||||
2 | 7781 | 8622 | 1537 | ||||
3 | 7390 | 7426 | 1926 | పార్టీ పేరు | సాధించిన ఓట్లు | అభ్యర్ధి పేరు | |
4 | 4854 | 4555 | 1817 | తెరాస | 96698 | కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి | |
5 | 6162 | 5245 | 2683 | భాజపా | 86485 | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | |
6 | 6016 | 5378 | 1962 | కాంగ్రెస్ | 23864 | పాల్వాయి స్రవంతి | |
7 | 7202 | 6803 | 1664 | ||||
8 | 6620 | 6088 | 907 | ||||
9 | 7517 | 6665 | 1684 | ||||
10 | 7503 | 7015 | 1347 | ||||
11 | 7214 | 5853 | 1788 | ||||
12 | 7448 | 5448 | 1828 | ||||
13 | 6691 | 5346 | 1206 | ||||
14 | 6612 | 5557 | 1177 | ||||
15 | 1270 | 1358 | 238 | ||||
మొత్తం | 96698 | 86485 | 23864 |
ఇది కూడా చదవండి: Munugode by poll: సీఈవో వైఖరి అనుమానాస్పదం…బండి సంజయ్