Site icon Prime9

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డులో సంస్కరణలు..

Telangana Inter Board

Telangana Inter Board

Hyderabad: తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారాలను వికేంద్రీకరిస్తూ పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇంటర్ విద్య కమీషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు.

ఇక నుంచి జిల్లా పరిధిలోనే అవసరమైన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్స్ అన్ని రకాల సెలవులు ఇక నుంచి మల్టీజోన్ ఆర్జేడీ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. సర్వీసు క్రమబద్దీకరణ, సీనియారిటీ జాబితాలను మల్టీజోన్ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగ విరమణ తరువాత పొందే ప్రయోజనాలకు సంబంధించిన దస్త్రాలు కూడ ఈ పరిధిలోకి చేర్చారు.

ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి నిర్ణయాధికారాన్ని ఇచ్చారు. ఉద్యోగుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్, పెండింగ్ ఫైళ్ల కోసం ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనితో వ్యక్తులతో సంబంధం లేకుండానే పరిశీలన, అనుమతులు జరుగుతాయి.

Exit mobile version