Hyderabad Rain: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మరో మూడు రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మరో మూడు రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలు.. వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాదురు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇక రానున్న మూడు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.