Site icon Prime9

Priyanka Gandhi: తొలిసారి తెలంగాణకు ప్రియాంక గాంధీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

priyanka gandhi

priyanka gandhi

Priyanka Gandhi: తెలంగాణకు తొలిసారిగా ప్రియాంకగాంధీ రానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. హైదరాబాద్ లో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. ఈ మేరకు ప్రియాంక పర్యటనకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లీంపులు చేపట్టారు.

ట్రాఫిక్ మళ్లింపు.. (Priyanka Gandhi)

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ‘యూత్‌ మేనిఫెస్టో’ప్రకటించనుంది. ఈ మేరకు వేలాది మంది నిరుద్యోగులతో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది. సాయంత్రం ఎల్బీనగర్‌ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వరకు ఈ ర్యాలీ ఉంటుంది. దీంతో ఎల్బీనగర్‌ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్‌ వైపు మళ్లించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్‌ నుంచి నాగోల్‌ వైపు మళ్లిస్తారు.

యూత్ మేనిఫెస్టో..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ‘యూత్‌ మేనిఫెస్టో’ప్రకటించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించనున్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సభలో.. యూపీఎస్సీ తరహాలోనే.. టీఎస్ పీఎస్సీ పనితీరును మెరుగుపరుస్తామని ప్రియాంకగాంధీ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. ఏటా జాబ్‌ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి.

సాయంత్రం రానున్న ప్రియాంక

కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రియాంకగాంధీ వస్తారు.

అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్‌ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

తర్వాత నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.

యువ డిక్లరేషన్ ప్రకటన..

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సరూర్‌నగర్‌ స్టేడియానికి చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు.

పీసీసీ యువ సంఘర్షణ సభలో పాల్గొంటారు. ప్రియాంక చేతుల మీదుగా యువ డిక్లరేషన్‌ ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్న తీరుపై ప్రసంగించనున్నారు.

Exit mobile version