Site icon Prime9

Vikarabad News: వికారాబాద్ లో వైద్యం వికటించి బాలింత మృతి

medicure-hospital-vikarabad

Vikarabad: వికారాబాద్ మెడిక్యూర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి యాజమాన్యం పై దాడికి పాల్పడ్డారు.

వికారాబాద్ మైలారదేవరపల్లికి చెందిన రమాదేవి డెలివరీ కోసం మెడిక్యూర్ హాస్పిటల్ వెళ్లగా డాక్టర్లు ఆపరేషన్ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికి మరణించింది. అయితే బాలింత మృతికి ముందే ఆమె కుటుంబ సభ్యులకు గర్భిణీ స్త్రీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని హైదరాబాద్ కు తీసుకువెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించామని వైద్యులు చెబుతున్నారు. పేషంట్ కుటుంబ సభ్యులు ఇక్కడే చేయండి ఏదైనా ప్రమాదం జరిగినా సిద్ధమే అన్న తర్వాతే చికిత్స ప్రారంభించామని వారు పేర్కొన్నారు.

Exit mobile version