Site icon Prime9

Preeti Brain Dead: ప్రీతి బ్రెయిన్‌డెడ్‌!.. నిమ్స్‌ వద్ద భారీగా పోలీసులు

nims

nims

Preeti Brain Dead: ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు.
వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నా.. తమ కూతురు బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ఆయన వాపోయారు.

హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు.. (Preeti Brain Dead)

పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ర్యాంగింగ్‌ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేసింది. గత ఐదురోజులుగా నిమ్స్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి మొదటి రోజుతో పోలిస్తే ఆదివారం నాటికి మరింత క్షీణించిందని ఆయన తెలిపారు. నిమ్స్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న.. తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు లేవని ఆవేదన చెందారు. ప్రీతి శరీరం రంగు మారిపోతోందన్నారు. ఇక ప్రీతిపై ఆశలు వదిలేసుకున్నట్లు తెలిపారు. ప్రీతి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని.. బతికే అవకాశాలు లేవని వైద్యులు కూడా చెప్పారని వివరించారు. ప్రీతి బ్రెయిడ్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ప్రీతిని సైఫ్ హత్య చేశాడని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే అని.. దీనిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మీడియాను వేడుకున్నారు.

ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై పలువురు నేతలు ఆరా తీశారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించి.. వారికి ధైర్యాన్ని ఇచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. ఎంపీ మాలోతు కవిత తదితరులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాత్రి వరకు.. ప్రీతి హెల్త్‌ బులిటెన్‌ పై వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మా..

ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. ఇక్కడ సీనియర్ల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అందులో తెలిపింది. సైఫ్‌
చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని తల్లికి తెలిపింది. సీనియర్లు అంతా ఒక్కటే అని.. పోలీసులతో నాన్న ఫోన్‌ చేయించినా లాభం లేదని వివరించింది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌ పై ఫిర్యాదు చేస్తే.. సీనియర్లు ఒకటై నన్ను దూరం పెడతారని తన బాధను వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రీతి తండ్రి ఆవేదన..

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రీతి తండ్రి స్పందించారు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పోలీసులు దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ర్యాగింగ్ పై పోలీసులకు ఇది వరకే సమాచారం ఇచ్చామని.. సకాలంలో వారు స్పందించలేదని చెప్పుకొచ్చారు. కాలేజీలో సీనియర్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రీతి తమ్ముడు అన్నాడు. వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Exit mobile version