Site icon Prime9

PG courses: ఆ కళాశాలల్లో పీజీ కోర్సులు రద్దు

PG courses were canceled in that college

Hyderabad: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సీపీగెట్ తొలి విడత సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 45 చోట్ల సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో పీజీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉండగా, రెండు, మూడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఈ ఏడాదికి కోర్సులను రద్దు చేశారు. అక్కడి విద్యార్ధులను రెండో విడత కౌన్సిలింగ్ లో ఇతర కళాశాలల్లో చేర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డులో సంస్కరణలు..

Exit mobile version