Paper Leak Case:పేపర్‌ లీక్‌ కేసులో కీలక ట్విస్ట్‌.. కమిషన్ సభ్యుల విచారణ

Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.

Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది. వీరినుంచి కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది.

కమిషన్ సభ్యుల విచారణ..

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది. వీరినుంచి కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. సిట్‌ ఇన్‌ఛార్జి ఏఆర్‌ శ్రీనివాస్‌ స్వయంగా వీరిని విచారించారు. పరీక్షల నిర్వహణ మెుత్తం.. కార్యదర్శి ఆధీనంలోనే ఉంటుంది. దీనితో పాటు.. కాన్ఫిడెన్షియల్‌ విభాగం కూడా కార్యదర్శి నియంత్రణలోనే పని చేస్తుంది. అయితే ఈ ఇంఛార్జిగా ఉన్న శంకరలక్ష్మి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ను నిందితుడు ప్రవీణ్ కొట్టేశాడు. దీంతో కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో భద్రతా ఏర్పాట్లపై సిట్ అధికారులు ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఒప్పంద ఉద్యోగ నియామకాలపై ఆరా

కమిషన్ లో ఒప్పంద ఉద్యోగులపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేష్‌ ఇద్దరూ కమిషన్‌లో ఒప్పంద ఉద్యోగులే.

అయితే వీరి నియామకం.. ఎంపిక ప్రక్రియ విధివిధానాలపై అధికారులు సమచారం సేకరించారు. వీరి ఎంపికలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందనే దానిపై పూర్తి సమాచారం సేకరించారు.

ఇక పోలీసు కస్టడీలో ఉన్న షమీమ్‌, సురేష్‌, రమేష్‌ లను పోలీసుల సుదీర్ఘంగా విచారించారు. ప్రవీణ్‌ ద్వారానే ప్రశ్నపత్రం వచ్చినట్టు వారు తెలిపారు.

కేసులో కీలక ట్విస్ట్‌..

ఇక ఈ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ ను రికార్డ్ చేయాలని భావిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్‌ తెలిపారు.