CM KCR: మరోసారి మోదీకి మొహం చాటేసిన కేసీఆర్

దేశ ప్రధాని రాష్ట్రానికి, అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. అయితే, మోదీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 08:05 PM IST

Hyderabad: దేశ ప్రధాని రాష్ట్రానికి, అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. అయితే, మోదీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయనను కలిసేందుకు, ఎదురుపడేందుకు కూడా ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు. మోదీ ముఖం చూడడానికి కూడ కేసీఆర్ ఇష్టపడటం లేదు.

ఏపీలో పర్యటన ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారు. రామగుండంలో ఎరువుల కర్మాగారంతోపాటు, రోడ్ల విస్తరణకు సంబంధించి జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే  తెలంగాణకు వస్తున్న ప్రధానికి ప్రొటోకాల్ ప్రకారం తోడుగా ఉండడం కేసీఆర్ కనీస బాధ్యత. కానీ, మునుగోడు హీట్‌తో దండయాత్రకు వచ్చిన బీజేపీని, మోదీని కనీసం చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదట. ఈ క్రమంలోనే సడెన్‌గా కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం భేటి కావడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్‌లోని సీజే నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయనతో భేటి అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం మర్యాదపూర్వకంగానే భేటి అయినట్టు సీఎంవో తెలిపింది. పలు పరిపాలనపరమైన ఇతర అంశాల పై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. హైకోర్టు సీజేతో భేటి అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇలా సడెన్ గా ఢిల్లీకి వెళ్లడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమిస్తున్న వేళ కేసీఆర్‌ లేకపోవడం చర్చనీయాంశంమైంది.

ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సమయంలోనే ఢిల్లీకి కేసీఆర్ వెళ్లడం రాజకీయ వేడిని మరింత పెంచింది. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు కనీసం ప్రొటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్‌ను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కేసీఆర్‌ని ఆహ్వానించామని స్వయంగా కేంద్రమంత్రులు చెబుతున్నారు. లేఖలు బయటపెట్టారు. టీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండిస్తున్నారు. మరోవైపు, మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో నో ఎంట్రీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అటు, మోదీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, కమ్యూనిస్టులు నిరసన చేపట్టారు. దీంతో పలుచోట్ల ఆ పార్టీల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆరోపించారు. అయి, రాజకీయంగా తేడాలు ఉండొచ్చు కానీ, రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని కలవటం అన్నది మంచి పద్దతిగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీరును గుర్తు చేస్తున్నారు. మోదీ రాజకీయాన్ని ఏ మాత్రం అంగీకరించని ఆయన, రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించటం, ఆయన వెంట ఉండటం, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా చూసుకోవటం ప్రస్తావిస్తున్నారు.

మరి, స్టాలిన్ తీరుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం తనకు పొసగని మోదీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే మూడుసార్లు మోదీకి ముఖం చూపించని సీఎం కేసీఆర్. ఈసారి కూడా అదే సీన్ ను రిపీట్ చేశారు. అయితే, ఇంతకు ముందు వచ్చిన సందర్భాలు వేరు. ఈసారి వేరు అన్నది మర్చిపోకూడదు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటానికి, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే, ఈసారి మాత్రం అధికారిక కార్యక్రమం. కానీ, దానికి కూడ కేసీఆర్‌ డుమ్మా కొట్టడటం ఆసక్తికరంగా మారింది.