Site icon Prime9

NIMS: నిమ్స్ లో విధులు బహిష్కరించిన నర్సులు

Nurses boycotted duties in Nims

Nurses boycotted duties in Nims

Hyderabad: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నర్సులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. ఓ హెడ్ నర్సు, టెక్సియన్ మద్య చోటు చేసుకొన్న ఘటన కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ధరణి అనే మహిళతో కలిసి రవితేజ అనే టెక్నిషియన్ రెచ్చిపోతున్నాడంటూ అందరూ తిరగబడ్డారు. ఆ ఇద్దరిని విధులు నుండి తొలగించాలంటూ ఆందోళనలకు దిగారు. దీంతో అత్యవసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆపరేషన్లు ఆగిపోయాయి. రోగులను పట్టించుకొనే వారు కరువైనారు.

ఈ సందర్భంగా బాధిత నర్సులు మాట్లాడుతూ టెక్నిషియన్ అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులపై చేయి చేసుకొనే పరిస్ధితి వరకు రావడం అవమానకరమన్నారు. నాలుగు రోజులుగా పై అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో విధులను బహిష్కరించామని వారు పేర్కొన్నారు. ఇంత ఘటనకు కారణం ఓ లాకర్ కావడం ప్రధాన చర్చగా మారింది, డ్యూటీ నర్సు తన అధీనంలోని లాకరు మరొకరికి ఎలా కేటాయిస్తుందంటూ టెక్నిషియన్ రవితేజ సీనియర్ నర్సును దుర్భషలాడాడు. అక్కడే ఉన్న ఓ డిస్పోసబుల్ బాక్స్ ను ఆమెపై విసిరి కొట్టడంతో నర్సులు అంతా ఏకమైనారు.

30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కొట్టడం ఏంటంటూ నర్సులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అతన్ని విధుల నుండి తప్పించాలంటూ వారు పదే పదే కోరుతున్నారు. రోగుల విలవిలలాడుతుంటే చూడలేకపోతున్నామన్నారు. విధిలేని పరిస్ధితిలో విధులను బహిష్కరించామని చెప్పుకొచ్చారు. అయితే వ్యవహారానికి ఉన్నత స్థాయి సిబ్బంది మౌనమే ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పాలి. ఘటన జరిగిన వెంటనే స్పందించి దాడికి పాల్పొడిన వ్యక్తిపై చర్యలు తీసుకొనివుంటే ఇంత దూరం వచ్చేది కాదు.

ఇది కూడా చదవండి: ఇక నుంచి డాక్టర్ సీతక్క.. ఉస్మానియా వర్శిటీలో పీహెచ్‌డీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

Exit mobile version